
నాసాకు చెందిన 1.5 టన్నుల నీల్ గేరెల్స్ స్విఫ్ట్ అబ్జర్వేటరీ స్పేస్ టెలిస్కోప్ భూమి వైపు దూసుకొస్తోంది, దీని శకలాలు భారత్లోని కొన్ని ప్రాంతాలపై పడే అవకాశాలు ఉన్నాయని నాసా అంచనా వేసింది.
ఈ టెలిస్కోప్ రీఎంట్రీ జోన్ భూమధ్యరేఖకు ఇరువైపులా 20.6 డిగ్రీల ఉత్తర, దక్షిణ అక్షాంశాల మధ్య విస్తరించి ఉంది, ఇందులో ముంబై, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి భారతీయ నగరాలు ఉన్నాయి.
భూమిపై 70 శాతం సముద్రాలు ఉండటం వల్ల శకలాలు జనవాసాలపై పడటానికి అతి తక్కువ అవకాశాలు ఉన్నాయని, శ్రీహరికోటలోని ఇస్రో రాడార్ దీని కదలికలను పర్యవేక్షిస్తోందని నాసా తెలిపింది.