
ఇంటి మరియు బయటి బాధ్యతల ఒత్తిడి వల్ల మహిళల్లో హార్మోన్ల అసమతుల్యత, థైరాయిడ్, అధిక రక్తపోటు వంటి సమస్యలు తలెత్తుతున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ముప్పై ఏళ్లు దాటిన మహిళలు క్యాల్షియం, ఐరన్, విటమిన్-డి ఉన్న ఆహారం తీసుకోవడంతో పాటు క్రమం తప్పకుండా యోగా, వాకింగ్ వంటి వ్యాయామాలు చేయాలి.
రోజులో కనీసం అరగంట నుండి గంట సమయాన్ని తమ సొంత ఆరోగ్యం, సంతోషం కోసం కేటాయించుకోవడం ద్వారా ఒత్తిడిని తగ్గించుకోవచ్చని సూచించడమైనది.