
ఏఐ సాంకేతికతతో తన మార్ఫింగ్ చేసిన అభ్యంతరకర ఫొటోలను సోషల్ మీడియాలో ప్రచారం చేయడంపై నటి మృణాల్ ఠాకూర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ చిత్రాలు పూర్తిగా నకిలీవని, వీటిని వెంటనే తొలగించకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటానని ఆమె హెచ్చరించారు.
సెలబ్రిటీల గౌరవాన్ని దెబ్బతీసేలా ఇలాంటి డీప్‌ఫేక్ కంటెంట్ సృష్టించడం తీవ్ర నేరమని, దీనిపై కఠిన చట్టాలు అవసరమని ఆమె పేర్కొన్నారు.