
ట్రినిడాడ్‌లో జరిగిన తొలి టెస్టులో వెస్టిండీస్ 90 పరుగుల తేడాతో పాకిస్థాన్‌పై విజయం సాధించి, ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ పాయింట్ల పట్టికలో కీలక మార్పులు తెచ్చింది.
వెస్టిండీస్ బౌలర్ జేడెన్ సీల్స్ రెండో ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు తీసి పాకిస్థాన్‌ను 120 పరుగులకే కుప్పకూల్చగా, జస్టిన్ గ్రీవ్స్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు.
ఈ ఓటమితో పాకిస్థాన్ 6.66% PCTతో పట్టికలో 9వ స్థానానికి పడిపోయి, టెస్ట్ ఛాంపియన్షిప్ రేసు నుంచి దాదాపు నిష్క్రమించింది.