
మహిళల ఛాంపియన్స్ ట్రోఫీ ఆరంభ టోర్నీకి ఆతిథ్యం ఇచ్చే హక్కులను శ్రీలంక క్రికెట్ బోర్డు కోల్పోయింది.
శ్రీలంక క్రికెట్ బోర్డు పరిపాలనలో ఆ దేశ ప్రభుత్వం జోక్యం చేసుకుంటున్న కారణంగా ఐసీసీ ఈ నిర్ణయం తీసుకుంది.
ఈ టోర్నీకి సంబంధించి తదుపరి ఆతిథ్య వేదికపై ఐసీసీ నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.