
ధనత్రయోదశి రోజు భారీగా పతనమైన బంగారం ధరలు ఆ తరువాత కొంత కోలుకోగా, నేడు దీపావళి సందర్భంగా దేశంలో గోల్డ్ రేటు స్థిరంగా నిలిచింది.
దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లో పసిడి ధరలు నిన్నటి మాదిరిగానే కొనసాగుతున్నాయని వర్గాలు వెల్లడించాయి.
పండుగ రోజు ధరలు స్థిరంగా ఉండటం బంగారం కొనుగోలుదారులకు ఒకింత ఊరటను కలిగించింది.