
బెంగళూరులోని 'కాన్రాడ్' ఫైవ్-స్టార్ హోటల్ స్విమ్మింగ్ పూల్లో సంభవించిన విద్యుత్ షాక్ ప్రమాదంలో ఇద్దరు విదేశీయులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
మృతుల్లో లుఫ్తాన్సా ఎయిర్లైన్స్ క్రూ మెంబర్ అలెగ్జాండర్ మాక్సిమిలియన్ థిస్, ఐబీఎం ప్రాజెక్ట్ మేనేజర్ యురాజ్ హోర్వాత్ ఉన్నారు.
వారిని రక్షించే ప్రయత్నంలో మరో ఇద్దరికి షాక్ తగలగా, మణిపాల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారి ప్రాణాపాయం తప్పింది.