
కర్నూలు జిల్లా కోడుమూరు ఎంపీడీవో కార్యాలయంలో జరుగుతున్న నామినేషన్ల ప్రక్రియను జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి పరిశీలించారు.
నామినేషన్ల స్వీకరణ ఏర్పాట్లు, ప్రక్రియ నిర్వహణ తీరును ఆమె స్వయంగా తనిఖీ చేశారు.
అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిబంధనలకు అనుగుణంగా పారదర్శకంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.