స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) గృహ రుణాల పోర్ట్‌ఫోలియో రూ. 10 లక్షల కోట్ల మైలురాయిని అధిగమించి రికార్డు సృష్టించింది.
ఎస్‌బీఐ చైర్మన్ సీఎస్ శెట్టి వెల్లడించిన వివరాల ప్రకారం, గృహ రుణాల మార్కెట్‌లో బ్యాంక్ 28 శాతం వాటాతో అగ్రస్థానంలో కొనసాగుతోంది.
ఈ వృద్ధి బ్యాంకింగ్ రంగంలో స్థిరమైన డిమాండ్‌ను సూచిస్తుందని, రాబోయే కాలంలో మరిన్ని రాయితీలతో రుణాలు అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని బ్యాంక్ తెలిపింది.