హైదరాబాద్ దూల్ పేట గంజాయి డాన్ నీతూబాయికి చెందిన 8 ప్రాంతాల్లో ఈడీ అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు.
గంజాయి అక్రమ రవాణా ద్వారా సంపాదించిన సొమ్ముతో ఆస్తులు కొనుగోలు చేసినట్లు ఈడీ అనుమానిస్తోంది.
సోదాల్లో కీలకమైన డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్న అధికారులు, మనీ లాండరింగ్ కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.