రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవడానికి సమతుల్య ఆహారం మరియు మంచి జీవనశైలి చాలా అవసరమని నిపుణులు తెలిపారు.
పళ్లెంలో రంగురంగుల కూరగాయలు, పండ్లు, తగినంత ప్రొటీన్లు ఉండేలా చూసుకోవాలని సీనియర్ క్లినికల్ న్యూట్రిషనిస్ట్ డాక్టర్ బత్తుల ఐశ్వర్య సూచించారు.
చిన్న పిల్లలకు సప్లిమెంట్లకు బదులుగా సహజమైన పోషకాహారాన్ని అందించాలని, తగినంత నిద్ర మరియు వ్యాయామం తప్పనిసరి అని పేర్కొన్నారు.