
రాయల్ ఎన్ఫీల్డ్ మోటార్‌సైకిళ్ల తయారీ సంస్థ ఐషర్ మోటార్స్ ఆంధ్రప్రదేశ్‌లోని తడలో కొత్త ప్లాంటును ఏర్పాటు చేయనుంది.
ఈ ప్రాజెక్టు కోసం తొలిదశలో రూ.1,225 కోట్ల పెట్టుబడిని పెట్టేందుకు కంపెనీ బోర్డు ఆమోదం తెలిపింది.
ఈ పెట్టుబడి ద్వారా రాష్ట్రంలో మోటార్‌సైకిళ్ల తయారీ సామర్థ్యం పెరగడంతో పాటు ఉపాధి అవకాశాలు మెరుగుపడనున్నాయి.