
పెరూలోని ఇకా ప్రాంతంలో శనివారం జరిగిన విమాన ప్రమాదంలో 13 మంది పర్యాటకులు, సిబ్బంది సజీవ దహనమయ్యారు.
ఎరోడియానా కంపెనీకి చెందిన టూరిస్ట్ విమానం నజ్కా సిటీ బయట కుప్పకూలి పేలిపోవడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.
మృతులలో ఇద్దరు జర్మన్లు, ఇద్దరు స్పానిష్, ఏడుగురు ఇటాలియన్ పౌరులు ఉన్నట్లు నజ్కా మున్సిపల్ ప్రభుత్వం ధృవీకరించింది.