అమెరికా మళ్లీ దాడులు ప్రారంభిస్తే యుద్ధాన్ని హిందూ మహాసముద్రానికి విస్తరిస్తామని, ఆ ప్రాంతంలోని అమెరికా నౌకలే లక్ష్యంగా దాడులు చేస్తామని ఇరాన్ భద్రతా మండలి కార్యదర్శి మొహసేన్ రెజాయ్ హెచ్చరించారు.
హైదరాబాద్‌లోని ఇరాన్ ఎంబసీ పోస్ట్ చేసిన వీడియోలో మాట్లాడుతూ, తమ హైపర్‌సోనిక్ మిసైళ్ల వేగాన్ని మాక్ 6 నుంచి మాక్ 10కి పెంచినట్లు ఆయన తెలిపారు.
అమెరికాతో ఎలాంటి చర్చలు ప్రారంభించాలన్నా తమ ఏడు షరతులను అంగీకరించాల్సిందేనని టెహ్రాన్ స్పష్టం చేసినట్టు ఎంబసీ పేర్కొంది.