
జిమ్లో వ్యాయామం చేసేవారు తమ శారీరక సామర్థ్యానికి మించి ఒక్కసారిగా తీవ్రమైన వ్యాయామం చేయకూడదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
వ్యాయామం చేసేటప్పుడు ఛాతీలో అసౌకర్యం, తల తిరగడం, స్పృహ కోల్పోవడం లేదా గుండె కొట్టుకునే విధానంలో అసాధారణ మార్పులు కనిపిస్తే వెంటనే వైద్య సహాయం తీసుకోవాలి.
కుటుంబంలో చిన్న వయసులోనే ఆకస్మిక గుండె సంబంధిత మరణాల చరిత్ర ఉన్నవారు వ్యాయామం ప్రారంభించే ముందు వైద్యుడిని సంప్రదించడం మంచిది.