
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆక్వా రైతులకు విద్యుత్ రాయితీని కొనసాగిస్తూ, యూనిట్ విద్యుత్‌ను రూ.1.50లకే అందించేలా ఎనర్జీ శాఖ జీవో ఆర్టీ నంబర్-57ను మంగళవారం జారీ చేసింది.
ఈ రాయితీ పథకం 2026 జూన్ 1వ తేదీ నుంచి అమలులోకి రానుండగా, సుమారు 6,500 రిజిస్టర్డ్ ఆక్వా ఫారాలకు దీనివల్ల లబ్ధి చేకూరనుంది.
మత్స్యశాఖ మరియు APSADA, CAA చట్టాల కింద రిజిస్ట్రేషన్ పొందిన అర్హత కలిగిన ఆక్వా ఫారాలకు మాత్రమే ఈ విద్యుత్ రాయితీ వర్తిస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది.