
హైదరాబాద్ గచ్చిబౌలి అంజయ్య నగర్‌లో శనివారం కుప్పకూలిన భవనం పక్కనే ఉన్న మరో ప్రమాదకర ఏడంతస్తుల భవనాన్ని హైడ్రా, మున్సిపల్ అధికారులు సోమవారం కూల్చివేశారు.
ఈ కూల్చివేత ప్రక్రియ కోసం బాహుబలి హైరిచ్ జాక్ క్రషర్‌ను ఉపయోగించి, పక్కనే ఉన్న వైట్ ఫీల్డ్ అపార్ట్‌మెంట్ వాసులను అధికారులు ముందస్తుగా ఖాళీ చేయించారు.
భవనం కూలిన ఘటనకు సంబంధించి యజమాని సయ్యద్ సాజిద్‌ను రాయదుర్గం పోలీసులు శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు.