
ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద అల్లర్లు సృష్టించేందుకు పాకిస్థాన్‌కు చెందిన జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ పన్నిన కుట్రను పశ్చిమ బెంగాల్ ఎస్టీఎఫ్ పోలీసులు భగ్నం చేశారు.
ఈ కేసులో హమిమ్ మండల్ అనే అనుమానితుడిని తూర్పు బర్ధమాన్ జిల్లాలో అరెస్ట్ చేయగా, కోర్టు అతనికి 14 రోజుల ఎస్టీఎఫ్ కస్టడీ విధించింది.
నిందితుల వద్ద బ్రిటన్, మెక్సికో దేశాలకు చెందిన సిమ్ కార్డులను స్వాధీనం చేసుకున్న పోలీసులు, వీరు మంత్రి ఉమేష్ రాయ్ కుమారుడిని హానీట్రాప్ ద్వారా కిడ్నాప్ చేయడానికి ప్లాన్ చేసినట్లు గుర్తించారు.