
ఇంజనీరింగ్ విద్యార్థులను ఉద్దేశించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ, ఆయన బహిరంగ క్షమాపణ చెప్పాలని బీఆర్‌ఎస్వీ నాయకుడు కంచర్ల రవి గౌడ్ డిమాండ్ చేశారు.
రెండు రోజుల క్రితం విద్యార్థులను ఉద్దేశించి ముఖ్యమంత్రి చేసిన 'క్రిమినల్స్ వేస్ట్' అనే వ్యాఖ్యలు అత్యంత అవమానకరమని సిరిసిల్లలో జరిగిన సమావేశంలో నాయకులు పేర్కొన్నారు.
ఈ నిరసన కార్యక్రమంలో మట్టె శ్రీనివాస్, ఆరెల్లి వినయ్, బక్కని వేణుయాదవ్, మల్యాల ప్రవీణ్ తదితర బీఆర్‌ఎస్వీ నాయకులు పాల్గొన్నారు.