
యాదమరిలో విద్యార్థులు తమకు వడ్డిస్తున్న అన్నంలో పురుగులు వస్తున్నాయని, పాచిపట్టిన నీళ్లు తాగుతున్నామని ఫుడ్ కమిషన్ సభ్యుడు కృష్ణకిరణ్‌కు ఫిర్యాదు చేశారు.
అన్నం మేకుల్లా గట్టిగా ఉంటోందని, సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు.
విద్యార్థుల ఫిర్యాదు మేరకు ఫుడ్ కమిషన్ సభ్యులు పాఠశాలలో ఆహార నాణ్యతపై తనిఖీలు చేపట్టారు.