
టాటా గ్రూపునకు చెందిన స్టాక్స్ మంగళవారం అనూహ్యంగా రాణించగా, టాటా కెమికల్స్ షేరు ఏకంగా 20 శాతం జంప్ అయింది.
నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ లైసెన్సును వదులుకోవడానికి టాటా సన్స్ సమర్పించిన దరఖాస్తును ఆర్‌బీఐ తిరస్కరించింది.
ఈ పరిణామాల నేపథ్యంలో మార్కెట్లో టాటా గ్రూప్ స్టాక్స్ భారీ ర్యాలీని ప్రదర్శించాయి.