
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సోదరుడి ఆదేశాల మేరకు తన కదలికలపై నిఘా ఉంచారని నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఆరోపించారు.
ఒక ఏసీపీ స్థాయి అధికారి తనను పర్యవేక్షిస్తున్నారని పేర్కొంటూ, ఈ మేరకు డీజీపీ సీవీ ఆనంద్‌కు అర్వింద్ ఎక్స్ వేదికగా ఫిర్యాదు చేశారు.
పోలీసులు చట్టానికి జవాబుదారీగా ఉండాలి కానీ రాజకీయ కుటుంబాలకు కాదని, ఈ వ్యవహారంపై ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.