
చిలీలోని వెరా సి. రూబిన్ అబ్జర్వేటరీలో ఉన్న 3200-మెగాపిక్సెల్ ఎల్ఎస్ఎస్‌టీ కెమెరా, 5 లక్షల గెలాక్సీలు మరియు 50,000 నక్షత్రాలతో కూడిన స్పష్టమైన చిత్రాన్ని బంధించింది.
సుమారు 3000 కిలోల బరువున్న ఈ భారీ కెమెరాను 8.4-మీటర్ల సిమోనీ సర్వే టెలిస్కోప్‌కు అమర్చి, నెలల తరబడి తీసిన వందలాది చిత్రాలను కలిపి ఈ తుది చిత్రాన్ని రూపొందించారు.
ఈ ప్రాజెక్ట్ 'లెగసీ సర్వే ఆఫ్ స్పేస్ అండ్ టైమ్'లో భాగంగా, రాబోయే 10 ఏళ్ల పాటు దక్షిణార్ధ గోళంలోని ఆకాశాన్ని నిరంతరం స్కాన్ చేసి మ్యాపింగ్ చేయనుంది.