
పశ్చిమ బెంగాల్ ఎస్టీఎఫ్ పోలీసులు జైషే మహమ్మద్ ఉగ్రవాద నెట్‌వర్క్‌తో సంబంధం ఉన్న అర్పిత సర్కార్‌ను శుక్రవారం అర్ధరాత్రి జార్ఖండ్‌లోని సాహెబ్‌గంజ్‌లో అరెస్టు చేశారు.
అరెస్టయిన హమీమ్ మోండల్, అర్పిత సర్కార్ వాట్సాప్ సంభాషణల ద్వారా వీఐపీల సమాచారాన్ని సేకరించి ఉగ్ర కార్యకలాపాలకు ప్రణాళికలు రచించినట్లు అధికారులు గుర్తించారు.
అర్పితను బర్ధమాన్‌కు తరలించి విచారిస్తున్న పోలీసులు, ఈ నెట్‌వర్క్‌తో సంబంధం ఉన్న మరికొందరి కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేశారు.