
రాష్ట్రంలోని గిరిజన గ్రామాలకు రహదారి సౌకర్యం కల్పించేందుకు ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ‘అడవితల్లి బాట 2.0’ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
రూ.2,052 కోట్ల అంచనా వ్యయంతో 1,976 కిలోమీటర్ల మేర కొత్త రహదారుల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు.
ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా మరో 1,341 గిరిజన ఆవాసాలు పక్కా రహదారులతో అనుసంధానం కానున్నాయి.