
అధిక రక్తపోటు (హై బీపీ) ఉన్నవారు ఉప్పు, అధిక కొవ్వు, ఎక్కువ చక్కెర ఉన్న ఆహార పదార్థాలను తగ్గించాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
ఊరగాయలు, ప్యాకేజ్డ్ స్నాక్స్, అప్పడాలు, ఇన్స్టంట్ నూడుల్స్ వంటి వాటిలో సోడియం మోతాదు అధికంగా ఉంటుంది.
ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ప్రకారం పెద్దలు రోజుకు 2,000 మి.గ్రా కంటే తక్కువ సోడియం అంటే దాదాపు 5 గ్రాముల ఉప్పు మాత్రమే తీసుకోవాలి.