
ఇటీవల మంత్రివర్గం నుంచి బర్తరఫ్ అయిన కొండా సురేఖను తమ పార్టీలోకి చేర్చుకునే ప్రసక్తే లేదని బీజేపీ సీనియర్ నేత మురళీధర్ రావు స్పష్టం చేశారు.
బీజేపీ అంటే రాజకీయ డంపింగ్ గ్రౌండ్ కాదని, ఇతర పార్టీల నుంచి బహిష్కృతులైన నేతలకు తమ పార్టీలో చోటు లేదని ఆయన ఎక్స్ వేదికగా పేర్కొన్నారు.
కాంగ్రెస్ అంతర్గత సమస్యల నుంచి దృష్టి మళ్లించేందుకు బీజేపీని చర్చలోకి లాగుతున్నారని, పార్టీని ఒక ప్రత్యామ్నాయ శక్తిగా నిలబెట్టడమే తమ లక్ష్యమని ఆయన తెలిపారు.