బంగాళాఖాతంలో ఏర్పడిన కొత్త అల్పపీడనం కారణంగా తెలుగు రాష్ట్రాల్లో రానున్న వారం రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది.
ఈ అల్పపీడనం ప్రభావంతో ఆగస్టు 13న వాతావరణంలో మార్పులు చోటుచేసుకుని, పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, లోతట్టు ప్రాంతాల వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.