
హైదరాబాద్‌లోని రాయదుర్గంలో తెలంగాణ రాష్ట్ర మౌలిక సదుపాయాల సంస్థ (TGIIC) నిర్వహించిన వేలంలో ఎకరం భూమి రూ. 264 కోట్ల రికార్డు ధరకు అమ్ముడైంది.
సర్వే నంబర్ 83/1లో ఉన్న మొత్తం 5.25 ఎకరాల భూమిని ఎంఎస్ఎన్ రియాల్టీ సంస్థ దక్కించుకోగా, గత నెలలో నమోదైన ఎకరం రూ. 237 కోట్ల రికార్డును ఇది అధిగమించింది.
ఈ వేలంలో ఎకరానికి రూ. 175 కోట్ల కనీస ధరను నిర్ణయించినప్పటికీ, బిడ్డర్ల మధ్య తీవ్ర పోటీ నెలకొనడంతో ధర భారీగా పెరిగింది.