
ఆసియా క్రీడల ఆర్చరీ మహిళల కాంపౌండ్ వ్యక్తిగత విభాగంలో డిఫెండింగ్ ఛాంపియన్ జ్యోతి సురేఖకు ప్రిక్వార్టర్స్‌లో ఊహించని పరాభవం ఎదురైంది.
దక్షిణ కొరియాకు చెందిన 14 ఏళ్ల కాంగ్ యోన్సియో చేతిలో 150-146 తేడాతో జ్యోతి సురేఖ ఓటమిపాలై టోర్నీ నుంచి నిష్క్రమించింది.
వ్యక్తిగత విభాగంలో నిరాశపరిచినప్పటికీ, మహిళల మరియు పురుషుల కాంపౌండ్ గ్రూప్ ఈవెంట్లలో భారత జట్లు సెమీఫైనేస్లోకి ప్రవేశించి పతక రేసులో నిలిచాయి.