జామ ఆకులలో ఉండే ఫ్లేవనాయిడ్లు, టానిన్లు రక్తంలో గ్లూకోజ్ శోషణను నెమ్మదింపజేసి షుగర్ లెవల్స్‌ను నియంత్రించడంలో సహాయపడతాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.
ఈ ఆకులతో తయారు చేసిన టీ లేదా కషాయాన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరుగుతుందని పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి.
డయాబెటీస్ నియంత్రణతో పాటు, జామ ఆకులు జీర్ణవ్యవస్థను శుద్ధి చేసి అజీర్తి, డయేరియా వంటి సమస్యలను తగ్గించడంలో సమర్థవంతంగా పనిచేస్తాయి.