
అంతర్జాతీయ మార్కెట్లో దేశీయ కరెన్సీ రూపాయి వరుసగా రెండో రోజూ బలపడి, మంగళవారం డాలర్ మారకంలో 16 పైసలు లాభపడి 95.62 వద్ద ముగిసింది.
అంతర్జాతీయంగా చమురు ధరలు భారీగా తగ్గడం, అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు తగ్గే సూచనలు కనిపించడం రూపాయి బలపడటానికి కారణమని ఫారెక్స్ ట్రేడర్లు తెలిపారు.
ట్రేడింగ్‌లో ఇంట్రాడే గరిష్టంగా రూపాయి 95.55 స్థాయిని తాకిందని, సోమ, మంగళవారాల్లో కలిపి మొత్తం 34 పైసలు పెరిగిందని నివేదికలు పేర్కొన్నాయి.