
దిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ సీఎం చంద్రబాబు ప్రధాని నరేంద్ర మోదీతో 7 లోక కల్యాణ్ మార్గ్‌లోని ఆయన నివాసంలో సమావేశమయ్యారు.
గోదావరి పుష్కరాలకు నిధులు ఇవ్వాలని, దక్షిణాది నదుల అనుసంధానం చేపట్టాలని ప్రధానిని చంద్రబాబు కోరినట్లు సమాచారం.
చంద్రబాబు ఇప్పటికే కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, సీఆర్ పాటిల్‌ను కలిసి రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.