
చైనాలోని హాంగ్జౌలో జరుగుతున్న ISSF షూటింగ్ వరల్డ్ కప్‌లో హైదరాబాద్ యువ సంచలనం ఈషా సింగ్ మహిళల 25 మీటర్ల పిస్టల్ విభాగంలో స్వర్ణం సాధించింది.
ఫైనల్లో 40 హిట్స్ నమోదు చేసిన ఈషా సింగ్, చైనా షూటర్ ఝాంగ్ యుయును 37 పాయింట్లకు పరిమితం చేసి పసిడిని కైవసం చేసుకుంది.
ఇదే ఈవెంట్‌లో డబుల్ ఒలింపిక్ పతక విజేత మను భాకర్ ఉత్కంఠ పోరులో 28 హిట్స్‌తో కాంస్య పతకాన్ని గెలుచుకుంది.