
ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ ఆగస్టు 15 నుంచి బెంగళూరులో పైలట్ ప్రాజెక్ట్‌గా ఫుడ్ డెలివరీ సేవలను ప్రారంభించేందుకు సిద్ధమైంది.
ప్రస్తుతం మార్కెట్లో ఉన్న జొమాటో, స్విగ్గీలు 16 నుంచి 30 శాతం కమిషన్ వసూలు చేస్తుండగా, ఫ్లిప్‌కార్ట్ కేవలం 10 శాతం కమిషన్ మాత్రమే వసూలు చేయాలని నిర్ణయించింది.
ఈ కొత్త సేవ కోసం ఫ్లిప్‌కార్ట్ ప్రత్యేకంగా ఒక యాప్‌ను రూపొందిస్తుండగా, బెంగళూరులో వినియోగదారుల స్పందనను బట్టి ఇతర నగరాలకు విస్తరించాలని ప్రణాళికలు సిద్ధం చేసింది.