
సూపర్‌స్టార్ రజనీకాంత్ ప్రధాన పాత్రలో, అశ్వత్ మారిముత్తు దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘ధర్మన్’ చిత్రంలో నయనతార భాగమయ్యారు.
ఇప్పటికే సిమ్రాన్, రాశీ ఖన్నా, శ్రీలీల, రామ్ పోతినేని వంటి భారీ తారాగణం నటిస్తుండగా, ఐదేళ్ల విరామం తర్వాత రజనీతో నయనతార మళ్లీ స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు.
ఈ చిత్రాన్ని డిసెంబర్ నాటికి టాకీ పార్ట్ పూర్తి చేసి 2027 పొంగల్ కానుకగా విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.