
తిరుపతి శ్రీ సిటీలోని భారీ టిల్ హెల్త్‌కేర్ పరిశ్రమలో బాయిలర్ ఒక్కసారిగా పేలిన ఘటనలో నలుగురు మృతి చెందగా, పలువురు కార్మికులు గాయపడ్డారు.
ఈ ప్రమాదంపై వైయస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని, బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా నిలిచి తగిన సహాయం చేయాలని ఆయన కోరారు.