
హోర్ముజ్ జలసంధిలోని లారక్ ఐలాండ్‌లో ఇరాన్‌కు చెందిన రెండు లాంచర్లపై అమెరికా సైన్యం సోమవారం తెల్లవారుజామున దాడులు చేసింది.
సీమైన్స్ కలిగిన రాకెట్లను ప్రయోగించేందుకు సిద్ధమవుతున్న ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ (ఐఆర్జీసీ) దళాలను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు జరిగాయి.
ఈ దాడుల్లో తమ సైనికులు, పౌరులు మరణించారని, గాయపడ్డారని పేర్కొన్న ఐఆర్జీసీ, అమెరికాకు భారీ మూల్యం తప్పదని హెచ్చరించింది.