
పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ జైలులో అనారోగ్యంతో బాధపడుతున్న నేపథ్యంలో, ఆయనకు మెరుగైన వైద్యం అందించాలని మాజీ క్రికెటర్ మొయిన్ ఖాన్ ప్రభుత్వాన్ని కోరారు.
భారత్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా వంటి దేశాలకు చెందిన 22 మంది మాజీ కెప్టెన్లు పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌కు బహిరంగ లేఖ రాశారు.
2023 ఆగస్టు నుంచి అదియాలా జైలులో ఉన్న 73 ఏళ్ల ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్య పరిస్థితిపై అంతర్జాతీయ స్థాయిలో ఆందోళన వ్యక్తమవుతోంది.