
టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ లిమిటెడ్ (టీఎంపీవీ) విద్యుత్ వాహనాల విభాగంలో తన మార్కెట్ వాటాను గణనీయంగా పెంచుకుంటోంది.
గత 6 నెలల కాలంలో టాటా ఈవీ బుకింగ్స్‌లో మూడు రెట్ల పెరుగుదల నమోదైనట్లు సంస్థ అధికారికంగా వెల్లడించింది.
ఈవీ రంగంలో సంస్థ సాధిస్తున్న వృద్ధికి ఈ బుకింగ్ గణాంకాలు నిదర్శనంగా నిలుస్తున్నాయి.