
ఇరాన్‌లోని పలు ప్రాంతాల్లో అణ్వాయుధ తయారీకి సంబంధించిన యురేనియం జాడలు కనిపించడంపై ఐఏఈఏ బుధవారం ఐరాస భద్రతా మండలికి ఫిర్యాదు చేసింది.
తమ విచారణకు ఇరాన్ ప్రభుత్వం సహకరించడం లేదని అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ (ఐఏఈఏ) ఈ ఫిర్యాదులో స్పష్టం చేసింది.
ఈ పరిణామం ఇరాన్ అణు కార్యక్రమాలపై అంతర్జాతీయంగా ఒత్తిడిని పెంచే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.