
జగిత్యాల జిల్లా మెట్‌పల్లి ఐసీడీఎస్ ప్రాజెక్టు సీడీపీఓ దారోజు పద్మ ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా చిక్కారు.
అంగన్‌వాడీ కేంద్రాల తనిఖీల్లో రిమార్క్‌లు నమోదు చేయకుండా ఉండేందుకు ఆమె మూడు నెలలకు సంబంధించి రూ.63 వేలు లంచం డిమాండ్ చేశారు.
ఫిర్యాదుదారు నుంచి కార్యాలయ ఆవరణలో ఆ మొత్తాన్ని తీసుకుంటుండగా అధికారులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు.