
యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ) లావాదేవీలపై ఎటువంటి రుసుములు విధించే ఆలోచన లేదని కేంద్ర ఆర్థిక శాఖ స్పష్టం చేసింది.
రూ. 3,000 దాటిన చెల్లింపులపై మర్చంట్ డిస్కౌంట్ రేటు (ఎండీఆర్) వర్తింపజేసే ప్రతిపాదనలు లేవని ప్రభుత్వం పేర్కొంది.
డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించే క్రమంలో యూపీఐ సేవలు యథావిధిగా ఉచితంగా కొనసాగుతాయని ఆర్థిక శాఖ తెలిపింది.