
జియోపీసీ సేవ ద్వారా పాత కంప్యూటర్లలో క్లౌడ్ ఆధారంగా 16జీబీ ర్యామ్, 1టీబీ స్టోరేజ్ పొందే సదుపాయాన్ని రిలయన్స్ జియో విస్తరించింది.
స్టాండర్డ్ ప్లాన్ రెండు నెలలకు రూ.1,000, అల్ట్రా ప్లాన్ రెండు నెలలకు రూ.1,200 ధరతో అందుబాటులో ఉన్నాయి.
ఈ సేవలు ఏ బ్రాడ్‌బ్యాండ్ లేదా 4జీ, 5జీ కనెక్షన్‌తోనైనా పనిచేస్తాయని, ఐదు నిమిషాల్లో సెటప్ చేసుకోవచ్చని కంపెనీ పేర్కొంది.