
బంగ్లాదేశ్‌లో విద్యుత్ సంక్షోభం తీవ్రమవడంతో షాపింగ్ మాల్స్, దుకాణాలను రాత్రి 8 గంటలకే మూసివేయాలని ప్రభుత్వం ఆదేశించింది.
ఢాకా మినహా మిగిలిన ప్రాంతాల్లో రోజుకు 8 నుంచి 10 గంటల పాటు విద్యుత్ కోతలు విధిస్తున్నారు.
అదనపు డీజిల్ సరఫరా చేయాలని బంగ్లాదేశ్ ప్రభుత్వం భారత రాయబారిని కోరింది.