
ఆగస్టు నెలలో జెప్టో, ట్రూహోమ్ ఫైనాన్స్, షిప్రాకెట్ వంటి డజనుకు పైగా కంపెనీలు ఐపీఓల ద్వారా రూ. 25,000 కోట్లకు పైగా నిధులు సమీకరించనున్నాయి.
జెప్టో కంపెనీ కొత్త ఈక్విటీ షేర్ల జారీ ద్వారా రూ. 8,010 కోట్లు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకోగా, ఇది ఈ జాబితాలో అతిపెద్ద ఇష్యూగా నిలవనుంది.
మార్కెట్ సెంటిమెంట్ మెరుగుపడటంతో ఇన్నాళ్లు వేచి చూసిన కంపెనీలు ఇప్పుడు తమ ఐపీఓ ప్రణాళికలతో ముందుకు వస్తున్నాయని మర్చంట్ బ్యాంకర్లు తెలిపారు.