
ఖైరతాబాద్‌లో కొలువుదీరిన 69 అడుగుల భారీ వినాయకుని నిమజ్జనం కోసం ఏర్పాట్లు పూర్తయ్యాయి, శుక్రవారం ఉదయం 7 గంటలకు శోభాయాత్ర మొదలవుతుంది.
నిమజ్జనానికి 65 టన్నుల బరువును మోయగల వోల్వో ఇంజిన్ టెక్నాలజీతో నడిచే భారీ ట్రైలర్‌ను సిద్ధం చేశారు.
రాజ్‌దూత్ చౌరస్తా, తెలుగుతల్లి చౌరస్తా మీదుగా ఎన్టీఆర్ మార్గ్‌లోని క్రేన్ నెం-4 వద్ద నిమజ్జనం చేయడానికి పోలీసులు రూట్‌మ్యాప్ ఖరారు చేశారు.