
ఫుకెట్ నుంచి ఢిల్లీకి వస్తున్న ఎయిర్ ఇండియా విమానం (AI379) గాలిలో ఉండగా ఒక్కసారిగా తీవ్ర కుదుపులకు గురికావడంతో 12 మంది ప్రయాణికులు గాయపడ్డారు.
మంగళవారం జరిగిన ఈ ఘటనలో 134 మంది ప్రయాణికులు ఉండగా, గాయపడిన వారిలో ఇద్దరు క్యాబిన్ సిబ్బంది కూడా ఉన్నారని ఎయిర్ ఇండియా యాజమాన్యం తెలిపింది.
విమానం సురక్షితంగా ఢిల్లీలో ల్యాండ్ అయిందని, గాయపడిన వారికి విమానాశ్రయంలోని వైద్య కేంద్రంలో చికిత్స అందించామని సంస్థ అధికారికంగా ప్రకటించింది.