ప్రకాశం జిల్లా అద్దంకిలో పోలీసు కారు ప్రమాదానికి గురైన ఘటనలో గంజాయి తరలిస్తున్నారన్న ఆరోపణలను ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఖండించారు.
ఆగస్టు 16న జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారిని ఎస్సైలు అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారని వీడియో ఆధారాలు ఉన్నాయని తెలిపారు.
తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, పోలీసుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయవద్దని హెచ్చరించారు.