
ఆంధ్రప్రదేశ్‌లో తొమ్మిది మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ డీజీపీ హరీశ్‌కుమార్ గుప్తా ఉత్తర్వులు జారీ చేశారు.
ఎస్పీఎఫ్ డీజీగా ఉన్న సీహెచ్ త్రివిక్రమ వర్మకు ఎఫ్ఎస్ఎల్ డైరెక్టర్‌గా, ఏసీబీ డైరెక్టర్‌గా ఉన్న జయలక్ష్మికి సీఐడీ సైబర్ క్రైమ్స్ ఐజీగా పోస్టింగ్ ఇచ్చారు.
పోస్టింగ్ కోసం ఎదురుచూస్తున్న కాంతి రాణా టాటాకు ట్రాఫిక్ మేనేజ్మెంట్ మరియు రోడ్ సేఫ్టీ ఐజీగా బాధ్యతలు అప్పగించారు.